calender_icon.png 26 August, 2025 | 1:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిమ్స్ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలే

25-08-2025 10:22:52 PM

NFIW రాష్ట్ర సహాయ కార్యదర్శి నళిని రెడ్డి

అదిలాబాద్,(విజయక్రాంతి): రిమ్స్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. భారత జాతీయ మహిళా సమాఖ్య (NFIW) రాష్ట్ర సహాయ కార్యదర్శి ముడుపు నళిని రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం రిమ్స్ కార్మికుల పెండింగ్ సమస్యలపై అదనపు కలెక్టర్ శ్యామలా దేవికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నళిని రెడ్డి మాట్లాడుతూ... 3 సంవత్సరాలుగా వివిధ కాంట్రాక్టర్లు మారినా కానీ కార్మికుల సమస్యలు పరిష్కారం అవడం లేదన్నారు.

రిమ్స్ లోని శానిటేషన్ కార్మికులు, పేషెంట్ కేర్ కార్మికులు సెక్యూరిటీ కార్మికులు, దాయ కార్మికులు, 30 సంవత్సరాలుగా రిమ్స్ లో పని చేసినప్పటికీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో రిమ్స్ లోని అధికారులు విఫలమయ్యారని, కాంట్రాక్టర్ లకు వత్తాసు  పలుకుతూన్నారన్నారు. కార్మికులను పట్టించుకోకుండా కాంట్రాక్టర్లు శ్రమ దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్ఐ కాంట్రాక్టర్లు కట్ చేసినప్పటికీ ఇప్పటి వరకు ఈఎస్ఐ కార్డు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. ఈ సమస్యలు పరిష్కరించని ఎడల, వేతనాలు పెంచకపోతే త్వరలో ధర్నా చేపడతామన్నారు.