25-08-2025 10:28:26 PM
ఈ ఏడు ఇప్పటికి 3375 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా
గతంలో కంటే 1100 మెట్రిక్ టన్నులు అధికంగా యూరియా అధికంగా అందించాం
మంథని వ్యవసాయ సహాయ సంచాలకు ఎన్. అంజని
మంథని,(విజయక్రాంతి): మంథని మండలానికి, గత సంవత్సరంలో ఆగస్టు 25-2024 వరకు 2278 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, ఈ సంవత్సరంలో ఈరోజు వరకి 3375 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయడం జరిగిందని, గతంలో కంటే 1100 మెట్రిక్ టన్నులు యూరియా అధికంగా సరఫరా చేయడమైనదని మంథని వ్యవసాయ సహాయ సంచాలకు ఎన్. అంజని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె యూరియా కోరత పై మాట్లాడారు.
మంథనిలో యూరియా కొరత లేదని, అధికంగా యూరియా వచ్చినప్పటికీ, యూరియా దొరకడం లేదని భయంతో రైతులు ఈ అధికంగా సరఫరా చేసిన మెట్రిక్ టన్నులు యూరియా ను రైతులు ముందస్తుగా కొనుగోలు చేసి వారి వారి పొలాల్లో, ఇండ్లలో పెట్టుకొని ఉన్నారని, రైతులు యూరియా లేదని పేపర్లలో, మీడియాలో వచ్చింది, చూసి రైతులు భయభ్రాంతులకు గురై, యూరియా రావట్లేదని, ప్రతి రోజు మండలానికి వచ్చి యూరియా లేదని భయాందోళనకి గురికావద్దని రైతులను కోరుచున్నానని, మన మంథని మండలానికి అత్యధికంగా యూరియా సరఫరా చేయడం జరుగుతుంది.
ఈ వారంలో రాష్ట్ర ప్రభుత్వం యూరియాని రైల్వే రేకుల ద్వారా తెప్పించనుంది. కాబట్టి రైతులు ఆందోళన చెందవద్దని కోరుతున్నానని, యూరియా విషయంలో రైతులు ఆందోళన చెందొద్దని రైతులకి తెలపడం జరిగిందని, దీంతో పాటు (ఆర్ఎఫ్ సీఎల్) యూరియా ప్లాంట్ మూసివేయడం వలన, యూరియా సరఫరాలో కొంచెం అంతరాయం కలగడం జరిగిందని, ఏది ఏమైనా గానీ యూరియా నిల్వలు అన్నిచోట్ల అన్ని డీలర్ షాపులలో అందుబాటులో ఉందని, రైతులు అవసరం మేరకు మాత్రమే యూరియాని తీసుకోగలరని విజ్ఞప్తి చేస్తున్నమన్నారు.