calender_icon.png 26 August, 2025 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాజ సేవకులు జర్నలిస్టులు...

25-08-2025 10:18:10 PM

మైనారిటీ జర్నలిస్ట్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ యూసుఫ్ బాబు

యాదాద్రి భువనగిరి,(విజయక్రాంతి): సమాజ సేవకులు జర్నలిస్టులు అని మైనారిటీ జర్నలిస్ట్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ యూసుఫ్ బాబు అన్నారు. సోమవారం భువనగిరి లోని ముస్లిం షాదీఖానలో జరిగిన ఎం.జే.ఎఫ్ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం మరియు సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాజంలో పెరిగిపోతున్న అవినీతి, అక్రమాలను, తగ్గిపోతున్న మానవత విలువలను, సామాజిక రుగ్మతులను, జర్నలిస్టులు, తమ కలాలతో వాస్తవాలను, నిర్భయంగా రాసి, ప్రజల గుండెల్లో నిలిచి పోవాలన్నారు. అసమానతలు రూపు మాపడానికి, సమాజంలో జరుగుతున్న అక్రమాలను, వైద్యుని వలె  శస్త్ర చికిత్సా చేసి,ప్రజల్లో చైతన్యం తీసుకు రావాలన్నారు.

మంచి కథనాలు రాసే జర్నలిస్టులకు, ప్రజల్లో ఎల్లప్పుడు గౌరవం ఉంటుందన్నారు. దేశ సమైక్యత, సమగ్రతలకు భంగం కలుగకుండా, ప్రజల్లో జాతీయతా భావాలను పెంపోoదించే విధంగా మన కథనాలు ఉండాలన్నారు. న్యాయవాది, ఏజీపీ, ఎంఏ రహీం మాట్లాడుతూ... మంచి వార్తలు రాసే జర్నలిస్టులు ప్రజల గుండెల్లో నిలిచి పోతారన్నారు. జర్నలిస్టులు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారదులుగా నిలువాలన్నారు.వాస్తవాలను వక్రీకరించకుండా, నిజాయితీ గా వార్తలను రాయాలన్నారు. ఈ సందర్బంగా నూతన జిల్లా అధ్యక్షడుగా ఎండీ సుజా ఉద్దీన్ ను, ప్రధాన కార్యదర్శిగా ఎండీ ఇస్టియక్, కోశాధికారి బైరపాక సిరీల్ మరియు ఇతర కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు.