calender_icon.png 25 August, 2025 | 4:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పవన్‌తో కాదు.. ఎన్టీఆర్‌తోనే..!

23-03-2025 12:12:08 AM

పవన్ కల్యాణ్, ఎన్టీఆర్‌లలో ఎవరిని ఎంచుకుం టారు? అనే ప్రశ్న తలెత్తితే ఏ నిర్మాత అయినా ఏం చెబుతారు? చాలా కష్టమైన ప్రశ్న. దీనికి తెలివిగా సమాధానం చెప్పలేదంటే.. ఇరుకున పడతారు. ఎవరికి అనుకూలంగా చెప్పినా మరొకరి ఫ్యాన్స్ బంతాడుకుంటారు. తాజాగా ఇదే ప్రశ్న నిర్మాత నాగవంశీకి ఎదురైంది. ఆయన చెప్పిన సమాధానం ఎలాంటి తలనొప్పి తెచ్చిపెట్టకపోవడం గమనార్హం. అంత తెలివిగా ఆయన సమాధానమిచ్చారు. ప్రస్తుతం పవన్ తన చేతిలో ఉన్న సినిమాలకే డేట్స్ కేటాయించడం క్లిష్టంగా మారింది. అటు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూనే సినిమా కోసం డేట్స్ కేటాయించడం కష్టమవుతోంది.

అందుకే ప్రొడ్యూసర్‌లు కొత్త సినిమాల విషయంలో ఆయన జోలికి వెళ్లడం లేదు. మ్యాడ్ స్కేర్ ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత నాగవంశీని హీరో సంగీత్ శోభన్.. ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో 50వ సినిమా కోసం పవన్ కల్యాణ్ లేదా ఎన్టీఆర్‌లలో ఒకరిని ఎంచుకోవాల్సి వస్తే ఎవరిని ఎంచుకుంటారు?’ అని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా.. “పవన్ కల్యాణ్ రాష్ట్రానికి, దేశానికి ఏం చేస్తారని కోరుకోవాలి కానీ సినిమా చేయాలని కోరుకోకూడదు” అని నాగవంశీ తెలిపారు. అంటే ఎన్టీఆర్‌తోనే సినిమా చేస్తానని ఆయన క్లారిటీ ఇచ్చేశారు.