25-08-2025 11:00:57 PM
ఏడాది వ్యవధిలోనే తల్లిదండ్రుల మరణం
మహబూబాబాద్,(విజయక్రాంతి): ఏడాది వ్యవధిలోనే తల్లిదండ్రులను కోల్పోయి మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణ పరిధిలోని కట్టు కాల్వకు చెందిన ఇద్దరు పిల్లలు అనాధలయ్యారు. కట్టు కాల్వకు చెందిన ఆంగోతు సరిత 11 నెలల క్రితం కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. భార్య మరణాన్ని తట్టుకోలేక తాగుడుకు బానిసగా మారిన ఆంగోతు శ్రీను నెల రోజుల క్రితం అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ సోమవారం మరణించాడు. దీనితో వారి కూతుర్లు వర్షిని, హర్షిని అనాధలుగా మారారు. ఈ సంఘటన చూసిన తండావాసులు చలించి పోయారు. ప్రభుత్వం అనాధలుగా మారిన పిల్లలను ఆదుకోవాలని కోరారు.