19-07-2025 12:10:54 AM
మేడిపల్లి ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డి
మేడిపల్లి జూలై 18; బోనాల పండుగ సందర్భంగా మేడిపల్లి ఇన్స్పెక్టర్ ఆర్ గోవిందరెడ్డి వివిధ ఆలయాల చైర్మన్ లతో, ఆర్గనైజర్లతో సమావేశం ఏర్పాటు చేశారు .ఈ సమావేశంలో ప్రజలు శాంతియుతంగా జాతరను జరుపుకోవాలని అన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. అల్లరి మూకలపై ప్రత్యేక నిఘా ఉంటుందని ఆయ న పేర్కొన్నారు. ఈ సమావేశానికి వివిధ కాలనీ చైర్మన్లు, ఆలయ చైర్మన్లు, ఆర్గనైజర్లు, ఎస్త్స్రలు వీరబాబు, తిరుపతి, ఉదయ భాస్క ర్, యాకన్న పాల్గొన్నారు.