calender_icon.png 19 July, 2025 | 6:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదివాసీల అభివృద్ధిలో కాంగ్రెస్ అలసత్వం

19-07-2025 12:12:10 AM

బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేల ధ్వజం 

అదిలాబాద్, జూలై 18 ( విజయ క్రాంతి ) : ఆదివాసీల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని బీజేపీ ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. జిల్లాలోని జైన థ్, బేల, సాత్నాల మండలాల్లో ప్రధాన మం త్రి జన్‌మన్ నిధుల నుంచి మల్టీపర్పస్ సెంట ర్‌ల నిర్మాణానికి వారు శుక్రవారం భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. పివిటిజీలు కొలం ఆదివాసులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ప్రధా నమంత్రి జన్ మన్ పథకంపై అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. పివిటిజీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నప్పటికీ స్థానిక కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వం చేస్తున్నందుకు కొంత ఇబ్బందిగా మారిందన్నారు.

ప్రధాన మంత్రి సడక్ యోజన కింద పివిటిజి గ్రామాలకు 66 కోట్ల రూపాయలతో 23 రోడ్లు మంజూరు కావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుభాష్, మహేష్, రాము, మహేందర్, అశోక్, విజయ్, సన్నీ, కరుణాకర్ రెడ్డి, రత్నాకర్ రెడ్డి, ముకుందరావు, రమేష్, దేవన్న, పలువురు ఆదివాసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు