19-07-2025 12:10:43 AM
బెల్లంపల్లి అర్బన్, జూలై 18 : బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం, ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ గా డాక్టర్ ఎం. ప్రసూన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన కె.వి.కె ప్రోగ్రాం కోఆర్డినేటర్ శివకృష్ణ పదోన్నతిపై బదిలీ అ య్యారు. ఆ స్థానంలో ప్రసూన బాధ్యతలు స్వీ కరించారు.
ఇంతకుముందు హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రా ష్ర్ట విశ్వవిద్యాలయ పరిధిలోని కాలేజ్ ఆఫ్ క మ్యూనిటీ సైన్స్, హైదరాబాద్ విస్తరణ విభాగపు ఆచార్యులుగా, కృషి విజ్ఞాన కేంద్రం, రస్థ కుంటుబాయి, విజయనగరంలో శాస్త్రవేత్తగా, ఏరువాక కేంద్రం, రంగారెడ్డిలో, వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ వ్యవసాయ సమాచార కేంద్రంలో సీనియర్ శాస్త్రవేత్తగా ప్రజా సంబంధాల శాఖ అధికారిగా, వ్యవసా య విద్యా సంస్థలో ఆచార్యులుగా ప్రసూన విధులు నిర్వర్తించారు.
ఈ సందర్భంగా డా. ప్రసూన మాట్లాడుతూ రైతుల ఆదాయం రెట్టింపు కావాలంటే నూతన వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల రైతులు సమగ్ర వ్యవసాయ విధానాన్ని అవలంభించాలని తెలిపారు.
సమగ్ర పంటల యాజమాన్యం, సమగ్ర ఎరువుల యాజమా న్యం, సస్యరక్షణ, సమగ్ర నీటి యాజమాన్య పద్ధతులను పాటించడంతో పాటు గృహ విజ్ఞాన సంబంధిత సాంకేతికతను ముఖ్యంగా మహిళా రైతులకు మరింత చేరువ చేసేలా ప్రణాళికతో ముందుకు సాగుతామని తెలిపారు. ఎప్పుడైనా తమ సలహాల కోసం బెల్లం పల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో అందుబాటులో ఉండే వ్యవసాయ శాస్త్రవేత్తలను సంప్రదించాలని రైతులకు ఆమె సూచించారు.