19-07-2025 12:00:00 AM
నిజామాబాద్, జూలై 18 (విజయక్రాంతి): నగరంలోని ఇందూరు ఉషోదయ మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం బోనాల పండుగ కన్నుల పండువగా నిర్వహించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థినులంతా పట్టు పరికిణీలు, చీరకట్టు వంటి సంప్రదాయ వస్త్రధారణతో హాజరుకావటం.. ఈ కార్యక్రమానికి ప్రత్యేక శోభ తెచ్చిపెట్టింది. బోనాల ఊరేగింపు ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ సూర్యప్రకాశ్, డైరెక్టర్ దేవరెడ్డి, ప్రిన్సిపాల్ స్వప్న, అధ్యాపక బృందం, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.