calender_icon.png 18 July, 2025 | 9:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం బోనాల పండుగ

18-07-2025 01:00:25 AM

నవదుర్గ దేవి ఆలయంలో బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయి చైతన్య

నిజామాబాద్ జులై 17: (విజయ క్రాంతి): తెలంగాణ లో సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం బోనాల పండుగ అని నవ దుర్గ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బోనాల పండగ ఘనంగా నిర్వహించడం గొప్ప విషయం అని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, సిపీ సాయి చైతన్య అన్నారు.

గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని పాత కలెక్టరేట్ లో  ఆనవాయితీగా నిర్వహించే బోనాల ఉత్సవాలను నవదుర్గ దేవీ ఆలయ కమిటీ చైర్మన్, టిజీఓ అద్యక్షులు అలుక కిషన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారికి బోనాలు తీసి, పూజలు నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అర్బన్  ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, రాష్ట్ర టిజీఓ అద్యక్షులు ఏలూరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సత్యనారయణ హాజరై బోనాలు ఎత్తుకొని అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే నవ దుర్గ దేవి ఎంతో మహిమగల అమ్మవారు అన్నారు.

కోరిన కోరికలు తీరుస్తూ, పాత కలెక్టరేట్ లో ఈ ఆలయం ఉండటంతో పండగ వాతావరణం ఉండేదని అన్నారు ప్రభుత్వ ఉద్యోగులకు ధైర్యాన్ని అందిస్తూ ఒకప్పుడు చిన్నగా ఉండే అమ్మవారి ఆలయం ఆలయ కమిటీ నిర్వాహకుల కృషితో ఆలయ నిర్మాణం చేపట్టడం అభినందనీయ విషయమన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ..

ఒకప్పుడు జిల్లా కలెక్టరేట్ ఈ ప్రాంతంలో ఉండేదని తాను బదిలీపై వచ్చిన తర్వాత అధికారుల ద్వారా తెలిసిందని ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో దైవ సన్నిధిలో కలెక్టర్ కార్యాలయం అప్పుడు ఉండడం ఎంతో గొప్ప విషయం అన్నారు. అప్పట్లో కలెక్టరేట్ ఇక్కడ ఉన్న సమయంలో ఆలయ అబివృద్దికి పనిచేసిన కలెక్టర్లకు, ఇతర అధికారులకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు.

అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. ఉద్యోగులు అందరూ ఒక్కటిగా ఒకే కుటుంబంలా బోనాల పండగ జరూపుకోవడం సంతోషం అనిపించిందని, గత ఎన్నో సంవత్సరాలుగా  ఆనవాయితీగా వస్తున్నటువంటి బోనాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నమన్నారు.

బోనాలు అనేవి మన తెలంగాణ ఈ కార్యక్రమంలో టిజీఓ అద్యక్షులు, ఆలయ కమిటీ చైర్మన్ అలుక కిషన్, ప్రధాన కార్యదర్శి అమృత్ కుమార్, కోశాధికారి ఉమా కిరణ్, ఉపాధ్యక్షులు చిట్టి నారాయణ రెడ్డి, సలహాదారులు ఆకుల ప్రసాద్,  సభ్యులు నెతుకుంట దాస్, జయింట్ సెక్రటరీ  గంధం వెంకటేశ్వర్లు, మహిళ ఉద్యోగులు, భక్తులు  పాల్గొన్నారు.