calender_icon.png 16 July, 2025 | 11:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనం బోనాల పండుగ

14-07-2025 12:00:00 AM

మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం హిందూ ప్రియ

కామారెడ్డి, జూలై 13 (విజయ క్రాంతి); తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనం బోనాల పండుగ అని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ అన్నారు. ఆదివారం కామారెడ్డి 8వ వార్డులో నిర్వహించిన బోనాల ఉత్సవాలు పాల్గొన్నారు. రుక్మిణి కుంట మైసమ్మ, ఎల్లమ్మ పోచమ్మ ఆలయాల వద్దకు శ్రీరామ్నగర్, అశోక్ నగర్, కాలనీ మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో ఊరేగింపుగా డప్పు చప్పులతో తరలి వచ్చి మోక్కులు చెల్లించుకున్నారు. కొత్త బస్టాండ్ వద్ద మైసమ్మ ఆలయం వద్ద  క్రేడా ఆధ్వర్యంలో బోనాలు తో వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.

తెలంగాణ జాగృతి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ కుమార్ గౌడ్ హాజరై మొక్కులు చెల్లించారు. క్రేడా వ్యవస్థాపక కాలభైరవ స్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ గంజి సతీష్, రామారెడ్డి మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి,  క్రేడా పాలకవర్గ ప్రతినిధులు రామ్ చందర్, నారా గౌడ్, చింతల నరసింహులు, గోగుల కిరణ్ కుమార్ రెడ్డి, కాకతీయ నగర్ కాలనీవాసులు, ఆర్.బి నగర్, బతుకమ్మ కుంట కాలనీ, రాజా నగర్ కాలనీ, గుమస్తా కాలనీ, లలో మహిళలు బోనాలతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయాలకు వచ్చి మోక్కులు చెల్లించుకున్నారు.