21-07-2025 01:36:58 AM
సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
వారాసిగూడ జూలై 20 (విజయక్రాంతి) : విశిష్టమైన తెలంగాణా సంస్కృతికి బోనాలు వేడుకలు ప్రతీకలుగా నిలుస్తాయని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. చిలకలగుడా లోని చారిత్రాత్మక కట్ట మైసమ్మ దేవాలయంలో ఆదివారం బోనాలు వేడుకల్లో పద్మారావు గౌడ్ పాల్గొ ని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయంలోనే బోనాలు వేడుకలకు ప్రాముఖ్యత పెరిగిందని ఆయన తెలిపారు. ప్రస్తుత సంవత్సరం సికింద్రాబాద్ పరిధిలోని దాదాపు 210 దేవాలయా లకు రూ. 1.12 కోట్ల మేరకు నిధులను నిధులను అందించామని తెలిపారు. కట్ట మైస మ్మ ఆలయాన్ని అభివృద్ధి చేసి విస్తరించేందుకు ఏర్పాట్లు జరిపామని తెలిపారు.
ప్రస్తుత సంవత్సరం ఆలయానికి రూ.11 లక్షల మేర కు నిధులను అందించామని తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా అధికారులు ఏర్పాట్లు జరపాలని సూచించారు. ప్రజలందరూ ఆనందంగా బోనాలు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించి, శుభాకాంక్షలు తెలిపారు.
పద్మారావుగౌడ్ తో పాటు ఆలయం కార్యనిర్వహణధికారి మహేందర్ గౌడ్, ఉత్సవ కమిటీ ఛైర్మన్ గుంటి కృష్ణ, కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, బీ.ఆర్.ఎస్. యువ నేత తీగుల్ల రామేశ్వర్ గౌడ్, బీ.ఆర్.ఎస్. నాయకులు కరాటే రాజు, కంది నారాయణ, సమన్వయకర్త రాజ సుందర్ పాల్గొన్నారు.
దేవాలయాల సందర్శన
సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాల్లో బోనాలు వేడుకల్లో భాగంగా వివిధ దేవాలయాలను ఎమ్మెల్యే పద్మారావుగౌడ్, యువ నేత రామేశ్వర్ గౌడ్ లు స్థానిక కార్పొరేటర్లు, నాయకులతో కలిసి సందర్శించి ప్రత్యెక పూజలు నిర్వహించారు.
బోనాలు సందర్భంగా అధికారులు జరిపిన ఏర్పాట్లను పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. కట్ట మైసమ్మ దేవాలయం వద్ద భక్తులతో పద్మారావు గౌడ్ ముచ్చటించారు. బోనం తో వచ్చిన భక్తులు ఎక్కువ సేపు క్యూ లైన్ లలో నిలవకుండా అధికారులు సహకరించాలని ఆదేశించారు.