24-07-2025 08:25:05 AM
జగదేవపూర్, (విజయక్రాంతి): జగదేపూర్ మండల పరిధిలోని పలుగడ్డ గ్రామంలో ఎన్నికల కోడ్ రాకముందే గ్రామస్తులంతా ఏకతాటి పైకి వచ్చి గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ పదవులను ఏకగ్రీవం చేసుకున్నారు.సర్పంచ్ అవ్వాలి అంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు అని మరో సారి రుజువయింది అని చెప్పకనే చెప్ప వచ్చు,వివరాల్లోకి వెళితే జగదేవపూర్ మండల పరిధిలోనీ పలుగడ్డ గ్రామంలో నర్రా కనకయ్య 2019 స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి ప్రత్యర్థి అభ్యర్థి చేతిలో ఒక్క (1)ఓటుతో ఓటమి చెందారు.
నాటి నుండి నేటి వరకు గ్రామానికి సర్పంచ్ అవ్వాలి అని పట్టు వదలని విక్రమార్కుడిలా ఎదురు చూసి 2025 సంవత్సరంలో ఎన్నికల కోడ్ రాకముందే గ్రామ ప్రజలను ఏకం చేసుకుని గ్రామంలో గ్రామ దేవతా పోచమ్మ ఆలయ నిర్మాణానికి 0.10 గుంటలు భూమితో పాటు త్రాగు నీటి బోరు ఏపిస్తానని ఎన్నికల కోడ్ రాకముందే పోచమ్మ దేవతా పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ చేస్తా అని హామీ ఇచ్చి మండలంలో ఏక గ్రీవ సర్పంచ్ గా ఎన్నుకోబడ్డాడు.ఉప సర్పంచ్ గా నర్రా రాజ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అని గ్రామస్థులు పలువురు తెలిపారు.గ్రామస్థులు అంత కలిసి ఎన్నుకొని సంబరాలు జరుపుకునీ సర్పంచ్,ఉప సర్పంచ్ లను శాలువాలతో సత్కరించారు.