24-07-2025 10:17:22 AM
గుండెపోటుతో చికిత్స పొందుతూ తల్లి మృతి.
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్(Nagarkurnool Collector ) బాదావత్ సంతోష్ మాతృమూర్తి బాదావత్ శాంతమ్మ (51) గురువారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. వరంగల్ జిల్లా కేంద్రంలోని స్వగృహంలో బుధవారం మధ్యాహ్నం గుండెపోటు రాగా ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. తల్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న కలెక్టర్ బాధావత్ సంతోష్ హుటాహుటిన వరంగల్ బయలుదేరారు. తండ్రి బాదావత్ హరిలాల్, ముగ్గురు కుమారులు ఉండగా వారిలో పెద్ద కుమారుడు నాగర్ కర్నూల్ కలెక్టర్ పనిచేస్తున్న బాదావత్ సంతోష్, రెండో కుమారుడు బాదావత్ తిరుపతయ్య, మూడవ కుమారుడు బాదావత్ బాలరాజులు ఉన్నారు. కలెక్టర్ మాతృమూర్తి బాదావత్ శాంతమ్మ అకాల మరణం పట్ల జిల్లా అధికారులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.