calender_icon.png 25 July, 2025 | 7:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేనల్లుడి కిడ్నాప్.. హత్య చేయించిన మామ

24-07-2025 09:35:34 AM

సనత్‌నగర్‌: హైదరాబాద్ నగరంలోని సనత్‌నగర్‌లో(Sanath Nagar) అదృశ్యమైన యువకుడు హత్యకు గురయ్యాడు. రెండు రోజుల క్రితం సనత్‌నగర్‌లో యువకుడు అదృశ్యమయ్యాడు. బంధువుల అమ్మాయిని వివాహం చేసుకోనందుకు యువకుడి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మామ మేనల్లుడిని కిడ్నాప్ చేసి హత్య చేయించాడు. అమ్మాయి మైనర్ కావడంతో అబ్బాయి కుటుంబ సభ్యులు  పెళ్లికి నిరాకరించారు. మేనమామే హత్య చేయించారంటూ యువకుడి కుటుంబసభ్యుల ఆరోపిస్తున్నారు. రెండు రోజుల క్రితమే సనత్‌నగర్ పోలీస్ స్టేషన్(Sanath Nagar Police Station) లో యువకుడి తల్లిదండ్రులు‌ మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మెదక్ జిల్లా తూప్రాన్ నర్సాపూర్ దగ్గర యువకుడి మృతదేహం లభ్యం అయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న  పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.