calender_icon.png 24 July, 2025 | 6:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరుణించిన వరుణుడు కురిసిన వర్షం

21-07-2025 01:38:09 AM

మహబూబాబాద్, జూలై 20 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లాపై ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. జిల్లాలో దంతాలపల్లి, నరసింహుల పేట, చిన్న గూడూరు, మరిపెడ, పెద్ద వంగర, కురవి మండలాల్లో మినహ మిగిలిన మండలాల్లో శనివారం రాత్రి ఓ మోస్తారు వర్షం కురిసింది. అత్యధికంగా కేసముద్రం మండలంలో 52.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

అలాగే గూడూరులో 40.0, గార్లలో 43.8, గంగారంలో 51.4, బయ్యారంలో 39.2, డోర్నకల్ లో 20.2, కొత్తగూడలో 11.2, నెల్లికుదురులో 16.0, మహబూబాబాద్, తొర్రూర్ లో 8.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వరుణుడు కరుణించడంతో జిల్లాలో వానాకాలం పంటల సాగుకు జీవం పోసినట్లయింది. జిల్లాలో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.