calender_icon.png 3 June, 2025 | 3:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

నాగాపూర్‌లో ఘనంగా బోనాలు

02-06-2025 12:31:39 AM

పెద్దమ్మ, గంగమ్మ కల్యాణోత్సవాలకు ముస్తాబు

మెదక్, జూన్ 1(విజయక్రాంతి): హవేళీఘణపూర్ మండలం నాగపూర్ గ్రామంలో ఆదివారం గ్రామ దేవతలకు ఘనంగా బోనాలు తీశారు. పెద్దమ్మ, గంగమ్మ ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా ముందస్తుగా ముత్యాలమ్మకు, పోచమ్మకు ముదిరాజ్ బోనాల ఊరేగింపు నిర్వహించారు.

కాగా  గ్రామంలో 2వ తేదీన గణపతి పూజ, అమ్మవారికి అభిషేకం, పెద్దమ్మ తల్లి కల్యాణోత్సవం జరుగుతుంది. 3న గోపూజ, ధాన్యాధివాసము, 4న మండపారాధన, జలధివాసము, తీర్థప్రసాదం, 5న ఉదయం 11.30 గంటలకు గంగమ్మ తల్లి కల్యాణోత్సవం, సాయంత్రం 5 గంటలకు గంగమ్మ బోనాలు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.