8 August, 2026 | 1:18 AM

స్వదేశీ స్ఫూర్తితో చేనేత రంగానికి అండగా నిలుద్దాం

08-08-2026 12:00 AM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): స్వదేశీ స్ఫూర్తితో చేనేత రంగానికి అండగా నిలుద్దామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు పిలుపునిచ్చారు. చేనేతలకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ శుక్రవారం ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. దేశ చరిత్రలో స్వదేశీ ఉద్యమ స్ఫూర్తిని పునరుజ్జీవింపజేసే అత్యంత ప్రాముఖ్యమైన రోజు ఈ జాతీయ చేనేత దినోత్సవమన్నారు. దేశంలో లక్షలాది మంది చేనేత కార్మికులు తమ అసమాన చేతి నైపుణ్యంతో అద్భుతమైన వస్త్రాలు,

హ్యాండ్లూమ్ ఉత్పత్తులను తయారు చేస్తూ దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటిచెబుతున్నారని కొనియాడారు. తెలంగాణ నేల చేనేత కళకు నిలయమని, ఇక్కడి నారాయణపేట, కొత్తకోట, గద్వాల, పోచంపల్లి, సిరిసిల్ల వంటి ప్రాంతాలు చేనేతకు ప్రపంచప్రసిద్ధి చెందాయని  గుర్తుచేశారు. మన చేనేత వస్త్రాలు దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో విశేష ఆదరణ, గుర్తింపు పొందుతుండటం మనందరికీ గర్వకారణమని అన్నారు.