10-08-2025 08:46:14 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలోని పోల్కంపేట్ క్లస్టర్ పరిధిలో కొత్తగా రిజిస్ట్రేషన్ భూములను కొనుగోలు చేసి పాసుబుక్కులు వచ్చినవారు, రైతు బీమా, నామిని మీద మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ విస్తీర్ణ అధికారి రాకేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 5 జూన్ 2025 వరకు కొత్తగా పట్టాదారు పాస్ బుక్ వచ్చిన రైతులకు బీమాకు దరఖాస్తు చివరి తేది 13 ఆగస్ట్-2025 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
గతంలో రైతు బీమా కొరకు దరఖాస్తు చేసిన రైతులు నామిని మార్పు కొరకై 12 ఆగస్టు 2025 లోపు దరఖాస్తు చేసుకోమన్నారు. దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు.. దరఖాస్తు ఫారం, రైతు పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్,రైతు ఆధార్ కార్డు జిరాక్స్, నామిని ఆధార్ కార్డు జిరాక్స్ పత్రాలను సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.14 ఆగస్టు 1966 నుండి 14 ఆగస్టు 2007 మధ్యలో పుట్టిన ఆధార్ కార్డులో 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వయస్సు ఉన్న రైతులు మాత్రమే భీమా చేసుకోవాలన్నారు.