calender_icon.png 11 August, 2025 | 12:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దమ్మ తల్లి ఆశీసులతో ఎల్లారెడ్డి ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి

10-08-2025 08:54:29 PM

ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): లింగంపేట మండలం సజ్జన్ పల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయ భూమిపూజ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు  గ్రామస్థులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి ఆశీసులతో ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా రైతులు సుఖసంతోషాలతో ఉండాలి అని కోరుకున్నారు.

పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణం,అభివృద్ధి కోసం తాను పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. తల్లి దీవెనలతో ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని అని అన్నారు. పెద్దమ్మ తల్లి ఆశీసులతో భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలను చేపడతానని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పేర్కొన్నారు. అనంతరం భక్తుల కోసం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని, స్వయంగా భక్తులకు వడ్డించారు.