10-08-2025 08:00:19 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి రైల్వే ఎస్సైగా సాధు లింబాద్రి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. కామారెడ్డి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో ఏఎస్ఐగా పని చేసిన లింబాద్ ఈటీవల ఎస్ఐగా పదోన్నతి పొందారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కు బదిలీపై వెళ్లారు. అక్కడి నుంచి కామారెడ్డి రైల్వే స్టేషన్ బదిలీపై వచ్చి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి రైల్వే స్టేషన్ పరిధిలో కోతుల పెడితే ఎక్కువ ఉందని ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి కోతల బెడద నుంచి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూస్తానని తెలిపారు.