10-08-2025 07:54:31 PM
నూతనకల్,(విజయక్రాంతి): నూతనకల్ మండల పరిధిలోని పలు గ్రామాలలో శనివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. యెడవెల్లి, మాచనపల్లి, చిలపకుంట్ల, ఎర్రపహాడ్, పెదనేమిల, బిక్కు మల్ల గ్రామాలలో మహిళలు ఆదివారం ముత్యాలమ్మ తల్లికి అత్యంత భక్తిశ్రద్ధలతో బోనాలు ఎత్తుకొని డప్పు వాయిద్యాల మధ్య ఊరేగింపుగా వెళ్తూ ముత్యాలమ్మకు పసుపు కుంకుమలు సమర్పించి గ్రామాల ప్రజలు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని తల్లికి నైవేద్యాన్ని సమర్పించారు.