11 August, 2026 | 1:34 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

మొన్న నారాయణ... నేడు శ్రీ చైతన్య పాఠశాలల బాగోతం

21-06-2025 10:21 PM

అడ్డుకున్న బీసీ పొలిటికల్ జెఎసి నాయకులు...

వనపర్తి టౌన్: ఫీజులు పుస్తకాల పేరిట నిలువు దోపిడి చేస్తున్న విద్యాశాఖ అధికారులు మామూళ్ల మత్తులో ఉన్నారని వనపర్తి పట్టణ అధ్యక్షుడు దేవర శివ, కొత్తకోట మండల అద్యక్షులు అంజన్న యాదవ్ ఆరోపించారు. శనివారం జిల్లా కేంద్రంలోనీ శ్రీ చైతన్య పాఠశాల నిర్వాహకులు పాఠశాల సమీపంలో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లలో పాఠ్యం పుస్తకాలను నిబంధనలకు విరుద్ధంగా అమ్ముతున్నారని మున్సిపాలిటీ అధికారులను సమాచారం ఇచ్చి పుస్తకాల గదికి తాళం వేయించారు.

వనపర్తి పట్టణ అధ్యక్షుడు దేవర శివ, మాట్లాడుతూ... నిబంధనలకు విరుధంగా వ్యవహరిస్తున్న చూసి చూడనట్లు వనపర్తి ఎంఈవో ఉన్నారని మామూళ్ల మత్తులో విద్యాశాఖ అధికారులు ఉన్నారని ఆయన అన్నారు. మొన్న నారాయణ నేడు శ్రీ చైతన్య పాఠశాలలు వ్యవహారాన్ని బయటపెట్టిన బీసీ పొలిటికల్ జెఎసి నాయకులు. ఈ విషయంపై విద్యాశాఖ అధికారులపై కలెక్టర్ కు పిర్యాదు చేస్తామని ఆయన అన్నారు.