14 May, 2026 | 4:03 AM

తెలంగాణ రక్షణ సేనలో చేరిన బొరిగి సంజీవ్

14-05-2026 02:57 AM

జుక్కల్, మే 13 (విజయక్రాంతి): తెలంగాణ రక్షణ సేన పార్టీలో కామారెడ్డి జిల్లా జుక్కల్ కు చెందిన తెలంగాణ పోలీస్ ఉద్యమకారుడు బోరిగి సంజీవ్ బుధవారం చేరారు. తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు కవితమ్మ పార్టీ కండువా కప్పి బొరిగి సంజీవ్ కు స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క ఆమె కూడా బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పాలనలో కూడా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు అన్నారు. నీళ్లు నిధులు నియమగల కోసం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పాలకులు ఏ ఒక్కటి సాధించలేకపోయారన్నారు.

తెలంగాణ రాష్ట్రం సాధించి 12 సంవత్సరాలు కావస్తున్న అప్పటికి నేటికి తెలంగాణ రాలేదని భోరిగి సంజీవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కవితమ్మ ఈ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రి కావాలని భోగి సంజీవ్ ఆకాంక్షించారు. కవితమ్మ పార్టీలో చేరి పార్టీని బలపరచాలన్నారు. ఆయనతో పాటు పలువురు తెలంగాణ రక్షణ సేనలో చేరినట్లు తెలిపారు.