14 May, 2026 | 4:03 AM

మొక్కుబడిగా మక్కల కొనుగోళ్లు

14-05-2026 02:53 AM
  1. కొనుగోలు కేంద్రంలోని ధాన్యపురాసులు
  2. అమ్ముకునేందుకు అవస్థ పడుతున్న రైతులు
  3. కూలీలు, గోదాం కొరత 

నిర్మల్, మే 13 (విజయ క్రాంతి): నిర్మల్ జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు మొక్కుబడిగా నిర్వహిస్తున్నారని రైతులు పేర్కొంటు న్నారు. కొనుగోలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న ఇప్పటివరకు నిర్మల్ జిల్లాలో 13 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు మాత్రమే పూర్తయినట్టు అధికారులు వెల్లడించారు.

ఇంకా బయట లక్ష క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో నిలువ ఉండడంతో కూలీల కొరత లారీల కొరత, గోలు సంచుల కొరత కారణంగా కొనుగోళ్లలో తీవ్ర జాబ్ జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో మొత్తం మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో 24 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిర్మల్ కుబీర్ కుంటాల లోకేశ్వరం దిల్వార్పూర్ సారంగాపూర్ మామిడాల లక్ష్మణ్ చందా కడెం ఖానాపూర్ పెంబి దస్తురాబాద్ తదితర ప్రాంతంలో ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ప్రభుత్వం మొక్కజొన్న పంటకు మద్దతు ధర 2400 ప్రకటించగా బయట వ్యాపారులు 1760కి కొనుగోలు చేస్తున్నారు. దీంతో దీంతో ప్రైవేట్ లో పంట విక్రయించుకుంటే నష్టపోతామని భావిస్తున్న రైతులు మొక్కజొన్న ప్రభుత్వ కేంద్రాలకు పంటను తరలించి విక్రయించుకునేందుకు నానా తండాలు పడుతున్నారు. 

రైతులకు తప్పని ఇక్కట్లు 

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన అధికారులు కొనుగోళ్ల విషయంలో జాప్యం చేయడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లావ్యాప్తంగా ఆయా కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్న పంట నిలువలు పెరిగిపోతున్నాయి. సీరియల్ నంబర్ 200 వరకు ఉంటుంది. మొక్కజొన్న కేంద్రాలు ప్రారంభమైన రైతు సీరియల్ నెంబర్ రావడానికి కనీసం నెలరోజుల సమయం పడుతుంది.

అప్పటివరకు వేచి చూసిన తూకం వేసేందుకు కూలీల కొడతా గోరు సంచలకోట తర్వాత రవాణాకు అవసరమయ్యే లారీల కొరత ఏర్పడడంతో పంట గోదాం తరలించే వరకు రైతు ఉండ పంటను కంటికి రెప్పల కాపాడుకుంటూ అక్కడే కాలక్షేపం చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికి మొక్కజొన్న రైతులు కొన్న పంటను రవాణా చేయడంలో కొనుగోల్ల జాప్యంపై నిర్మల్ ముధోల్ సారంగాపూర్ కుంటాల మామున మండలంలో పెద్ద ఎత్తున వస్తారు ఆందోళన నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం మొక్కజొన్న పంట ఖాళీ అయితే మరో వారం రోజులు వరి పంట చేతికి వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు పంటలు అమ్ముడు పోతేనే ప్రతి రైతుకు ఖరీఫ్ సీజన్ పెట్టుబడులకు పంట ఆదాయం ఉపయోగపడుతుంది. ప్రస్తుతం పంట చేతికి రావడంతో రైతులు ఖరీఫ్ సంబంధించిన వేసవి దిక్కులు దున్నుకోవాల్సి ఉంటుంది.

వ్యవసాయ పనులు చేసే రైతులు పంటకు కాపలా కాస్తూ కన్నీరు పెట్టుకుంటున్నారు. పంట కొనుగోలపై ప్రభుత్వం వేగం పెంచాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించిన క్షేత్రస్థాయిలో మాత్రం కూలీల కొరత లారీల కొరత గోన సంచుల కొరత కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నట్టు అధికారులు తెలిపారు. 

గోదాములు లేకనే 

నిర్మల్ జిల్లాలో ఒకేసారి మొక్కజొన్న వారి శనగ పంటలు రావడంతో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా గోదాములలో ధాన్యం పెద్ద ఎత్తున విలువ ఉంది. ఏ గోదాము చూసిన సంచులతో నిండుకొని ఉండడంతో అది ఖాళీ చేయడానికి వీలు కావడం లేదు. గత ఏసంగి సంబందించిన వరి పంట నిల్వ ఉండడంతో కొత్త పంట తీసుకునే పరిస్థితి లేదు. దీనికి తోడు లారీల కొరత కూడా తీవ్రంగా ఉంది. లారీలో ధాన్యం లోడ్ చేసిన గోదాములకు వెళ్లి ఖాళీ కావడానికి మూడు రోజుల సమయం పడుతుంది.

అక్కడ కూడా కూలీలు లేక ఉన్న కూలీలతో సరిపెట్టుకుంటున్నారు. దీనివల్ల ధాన్యం తరలింపు ప్రక్రియ ఆలస్యం అవుతుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో నిలువ ఉన్న మొక్కజొన్న తడిసిపోయినట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు స్వచ్ఛందంగా ట్రాక్టర్లు డీసీఎంలు మాట్లాడుకుని అధికారులతో సంబంధించి వారికి సంబంధించిన పంటను స్వయంగా వారే గోదాములకు తరలించుకోవాల్సిన పరిస్థితి నెలకొందని అంటున్నారు.

కూలీలకు లారీల కొరత కారణంగా రైతుల వద్ద నుంచి నిర్ణీత రుసుము కంటే ఎక్కువగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. దీనివల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. ఆయా కొనుగోలు కేంద్రాల్లో నిలువ ఉన్న పంటను దృష్టిలో పెట్టుకొని కూలీల కొరత లారీల కొరత గోనెసంచుల కొడతా లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అయితే ఈ ప్రక్రియ వారం రోజుల్లో పూర్తిచేస్తేనే రైతులకు ప్రజలు ఉంటుంది ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా రైతులు కోరుతున్నారు.