calender_icon.png 19 August, 2025 | 12:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లారీ ఢీకొని బాలుడి దుర్మరణం

07-07-2024 12:05:00 AM

వికారాబాద్ రూరల్, జూలై 6: లారీ ఢీకొని బాలుడు మృతిచెందిన ఘటన వికారాబాద్ జిల్లా తాండూర్ మండలంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. ఏపీలోని అనంతపూర్ జిల్లా గుత్తి మండలం అనగానిదొడ్డికి చెందిన మదం హన్మంత్, వరలక్ష్మిదంపతులు కుటుంబంతో కలిసి తాండూర్ మండలానికి వలస వచ్చారు. ఇక్కడే కూలి పనులు చేసుకుంటున్నారు. శనివారం ఉదయం హన్మంత్ తన కూతురితో పాటు కుమారుడు జనార్దన్‌ను (8) తాండూర్‌లోని పాఠశాలలో వదిలేందుకు బైక్‌పై బయలుదేరాడు. కొద్ది దూరం వెళ్లగానే రోడ్డుపై ఆగి ఉన్న లారీ ఒక్కసారిగా రివర్స్‌లో వెనుకకు వచ్చింది. ఈ క్రమంలోనే బైక్ అదుపుతప్పి కిందపడింది. తండ్రి తప్పించుకున్నప్పటికీ లారీ టైర్లు జనార్దన్ తలపై నుంచి వెళ్లాయి. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. కుటుంబీకులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై విఠల్ రెడ్డి తెలిపారు.