calender_icon.png 23 May, 2025 | 11:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బదిలీపై వెళ్తున్న తాసిల్దార్ కు సన్మానం

23-05-2025 06:43:20 PM

నాగారం: నాగారం మండల తహసీల్దార్ గా బ్రహ్మయ్య పనిచేసి ఇటీవల బదిలీపై యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కు బదిలీ అయ్యారు. శుక్రవారం నాగారం మండల తాసిల్దార్ కార్యాలయం డిప్యూటీ తాసిల్దార్ షాహిని బేగం ఆధ్వర్యంలో పూలమాలతో శాలువాతో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

అనంతరం వారు మాట్లాడుతూ... ప్రతి ఉద్యోగికి బదిలీ సహజమే అన్నారు. ఎక్కడ పని చేసిన ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మారయ్య, మండల వ్యవసాయ అధికారి కృష్ణ కాంత్, మండల ప్రణాళిక సంఘం అధికారి చింతమల్ల రమేష్, ఆసిఫ్ గిరి, మహేశ్వరి, శోభ, సతీష్, వెంకన్న ,అంజయ్య, మహేష్, తదితరులు పాల్గొన్నారు.