calender_icon.png 24 May, 2025 | 12:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు సైబర్ నేరాల బారిన పడకుండా కాపాడాలి

23-05-2025 06:52:22 PM

ఉపాధ్యాయులకు పోలీసుల అవగాహన

మహబూబాబాద్,(విజయక్రాంతి): సైబర్ నేరాలు, అఘాయిత్యాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులను వాటి బారిన పడకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, చదువుతోపాటు మంచి నడవడికతో మెలగడానికి ఉపాధ్యాయుల కృషి ఎంతో అవసరమని మహబూబాబాద్ షీటీం ఎస్ఐ సునంద అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయ శిక్షణ శిబిరంలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ ఎస్ ఐ కర్ణాకర్, షీ టీం ఎస్ఐ సునంద ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఫేస్ బుక్, ఇంస్ట్రా గ్రామ్, సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫోటోలు, వివరాలు పంచుకోవడంలో జాగ్రత్తలు వహించాలని సూచించారు. సైబర్ నేరాలు జరిగితే వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎవరికైనా ఎలాంటి ఆపద తలెత్తినా, అత్యవసర సహాయం అవసరమైనా 100కు దయచేయాలని కోరారు. విద్యార్థినిలు, ఉపాధ్యాయినీలు టి సేఫ్ యాప్ వినియోగించడం వల్ల ప్రయాణాల్లో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని వివరించారు.

జిల్లాలో ఎవరికైనా ఇబ్బందులు కలిగితే 8712656935 నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదుదారుల పేర్లు గోపియంగా ఉంచడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భరోసా, షీ టీం, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, సైబర్ క్రైమ్ టీం సిబ్బంది జ్యోత్స్న, జయశ్రీ, రేణుక, సుప్రజ, అరుణ, రమేష్ పాల్గొన్నారు.