calender_icon.png 24 May, 2025 | 12:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులను ప్రోత్సహించాలి

23-05-2025 06:48:48 PM

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): ప్రత్యామ్నాయ పంటల సాగు, ప్రకృతి వ్యవసాయం పట్ల జిల్లా రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్  ఇలా త్రిపాఠి అన్నారు. వరి, పత్తి  వంటి సంప్రదాయ పంటలే కాకుండా, కూరగాయలు, పండ్ల తోటలు, వాణిజ్య పంటలు సాగు చేయడం,ప్రకృతి వ్యవసాయం చేసేలా రైతులకు  పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు. శుక్రవారం ఉదయాదిత్య భవన్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు, వ్యవసాయ అధికారులతో రానున్న వానకాలం వ్యవసాయ సాగు సంసిద్ధతపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ మాట్లాడారు.

రైతులు క్రమం తప్పకుండా పండించే వరి, పత్తి  వంటి  పంటల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,ప్రత్యేకించి వరిలో శ్రమ ఎక్కువ, ఆదాయం తక్కువగా  ఉండడం,  పంట అమ్మకంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం, అకాల వర్షాల వంటి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని జిల్లా రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్ళించాలని, ముఖ్యంగా కంది, కూరగాయలు,  పండ్ల తోటలు, అధిక ఆదాయం ఇచ్చే వాణిజ్య  పంటలవైపు వారిని మళ్లించాలని తెలిపారు. వ్యవసాయ రంగంలో అద్భుతమైన ఫలితాలు సాధించేందుకు  రైతులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, ప్రభుత్వం సమగ్రమైన ఆలోచనతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని మాజీ శాసనసభ్యులు, కట్టంగూరు రైతు ఉత్పాదక సంస్థ వ్యవస్థాపకులు నంద్యాల నరసింహారెడ్డి అన్నారు.

వివిధ రకాల  పంటల సాగు, ప్రకృతి వ్యవసాయంలో అద్భుతాలు సాధిస్తున్న  అభ్యుదయ రైతులు మరి కొంతమంది అభ్యుదయ రైతులను తయారు చేయాలని, రైతులలో వ్యాపార దృక్పథం పెరగాల్సిన అవసరం ఉందని, రైతులు పండించిన పంటలకు పటిష్ట మార్కెట్ వ్యవస్థ ఉండాలని, మధ్యదళారీ వ్యవస్థ తగ్గాలని అన్నారు. వ్యవసాయంలో ఉత్పాదకత  పెరిగి పెట్టుబడి తగ్గేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా కూరగాయల సాగు సాగు, పామాయిల్ పై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కరపత్రాన్ని, బుక్ లెట్ ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు .జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, ఉద్యాన శాఖ అధికారి అనంతరెడ్డి, తదితరులు ఈ సదస్సుకు హాజరయ్యారు.