23-05-2025 06:28:59 PM
కలెక్టరేట్ ఏఓకి వినతి చేసిన విహెచ్పి నాయకులు
మంచిర్యాల,(విజయక్రాంతి): గోవుల అక్రమ రవాణా, గోహత్యలను నివారించాలని విశ్వహిందూ పరిషత్ గోరక్ష ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ (ఏవో) రాజేశ్వర్ కి శుక్రవారం మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా గోరక్ష ప్రముఖ్ రాజ సమ్మయ్య(Mancherial Goraksha Pramukh Raja Sammaiah) మాట్లాడుతూ... గోవులను కాపాడుకోవాల్సిన బాధ్యత హిందువులందరిపైన ఉన్నదన్నారు. విశ్వమాత గోమాతను హిందువులు తల్లిగా భావిస్తారని, గోవులను రక్షించుకోవాలని, గోవధను నిర్మూలించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షురాలు గొట్టిపర్తి కనకతార, విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి వేముల రమేష్, సభ్యులు ఇరుకుల్ల రాజేశం తదితరులు పాల్గొన్నారు.