23-05-2025 06:25:16 PM
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
పాపన్నపేట: ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించడంతోపాటు ఉపాధ్యాయులలో బోధన అభ్యసన నైపుణ్యాలను పెంపొందించేందుకు గాను శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. శుక్రవారం పాపన్నపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నటువంటి ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని అందుకోసమే ప్రభుత్వం ఈ శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉపాధ్యాయులు ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని రానున్న విద్యా సంవత్సరంలో విద్యార్థులలో ప్రతిభను వెలికి తీసేందుకు గాను అవసరమైన చర్యలు చేపట్టేందుకు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు జిల్లా విద్యాధికారి రాధా కిషన్ అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుదర్శన మూర్తితో పాటు ఇతరులు ఉన్నారు