calender_icon.png 24 May, 2025 | 1:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విత్తనాలు, ఎరువులు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు

23-05-2025 07:01:14 PM

రైతులు కొన్న ఎరువులు విత్తనాలకు తప్పనిసరిగా రసీదులు తీసుకోవాలి

 జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ 

పాపన్నపేట: ఎరువులు విత్తనాలను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే రైతులకు అమ్మాలని, అధిక ధరలకు విక్రయిస్తే సంబంధిత డీలర్ పై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. శుక్రవారం పాపన్నపేట మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... రైతులు కొనుగోలు చేసే ప్రతి ఎరువులు విత్తనాలకు తప్పనిసరిగా రసీదును తీసుకోవాలని సూచించారు.

రైతు సంతకం తో కూడిన రషీదును రైతులకు అందజేయాలనీ నిర్వాహకులకు ఆదేశించారు.  విత్తనాల రికార్డులు కంపెనీ పత్రాలు విత్తన ప్యాకెట్ల పై ఉన్నటువంటి లేబుల్స్ వ్యాపార లైసెన్సు కొనుగోల రిజిస్టర్లు మరియు స్టాక్ రిజిస్టర్ తో పాటు ధర లతో కూడినటువంటి బోర్డును ఈ సందర్బంగా కలెక్టర్ పరిశీలించారు.  ప్రభుత్వం చేత గుర్తింపు పొందినటువంటి దుకాణాలలోనే విత్తనాలను కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో AO నాగమాధురి AEO జనార్దన్ ఉన్నారు