6 July, 2026 | 3:38 PM

Breaking News

శ్రీ రాజరాజేశ్వర స్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం   •   టెండర్లు పూర్తికాగానే తాసిల్దార్ కార్యాలయానికి భూమి పూజ   •   ఓటరు జాబితా సవరణపై ఆదివాసి గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ నాయకులు.   •   విజయక్రాంతి వార్తకు స్పందన.. రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •  

ప్రతిభ కనబరిచిన విద్యార్థినికి మెరిట్ స్కాలర్ షిప్ చెక్ పంపిణీ

23-05-2025 06:57 PM

సింగరేణి ఏరియా జీఎం దేవేందర్

మందమర్రి,(విజయక్రాంతి): ఉన్నత విద్యలో ప్రతిభ కనబరిచిన సింగరేణి ఉద్యోగుల పిల్లలకు సింగరేణి యాజమాన్యం అందించే మెరిట్ స్కాలర్ షిప్ రూ.10 వేల చెక్ ను ఏరియా వర్క్ షాప్ లో జనరల్ మజ్దూర్ గా విధులు నిర్వహిస్తున్న బొడ్డు కుమారస్వామికి సింగరేణి ఏరియా జీఎం జి దేవేందర్ అందచేశారు. జీఎం కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మెరిట్ స్కాలర్ షిప్ చెక్ ను అందచేశారు. కార్మికుని కూతురు బొడ్డు వైష్ణవి హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో ఎంబీబీఎస్ 4వ సంవత్సరం చదువుతుంది.

ఈ సందర్భంగా ఏరియా జీఎం మాట్లాడుతూ ఉన్నత చదువులు చదువుతున్న ఉద్యోగుల పిల్లలను ప్రోత్సహించేందుకు సింగరేణి సంస్థ  మెరిట్ స్కాలర్షిప్ ను అందజేస్తుందన్నారు. కార్మికులు తమ పిల్లలను ఉన్నత చదువుల దిశగా ప్రోత్సహించినందుకు తల్లి దండ్రులను ఆయన  అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏరియా  పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, ఏఐటీయూసీ జిఎం స్ట్రక్చర్ కమిటీ మెంబర్ సివి రమణ, ఆఫీస్ సూపరింటెండెంట్ రాజలింగు లు  పాల్గొన్నారు.