19 May, 2026 | 3:59 AM

కరెంట్ షాక్‌తో బాలుడి మృతి

10-11-2024 12:05 AM

నాగర్‌కర్నూల్, నవంబర్ 9 (విజయక్రాంతి): గుడిసెలో కూలర్ ఆన్ చేయబోయి విద్యుదాఘాతానికి గురై 3వ తరగతి చదువుతున్న బా లుడు మృతి చెందిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఐతోలు గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెం దిన ఎల్లగౌడ్, సుజాత దంపతుల కుమారుడు నిశాంత్‌గౌడ్(8) 3వ తరగతి చదువుతున్నాడు. శనివారం సెలవుదినం కావడంతో తమ గుడిసెలో ఉన్న కూలర్ ఆన్ చేస్తుండగా కరెంట్ షాక్‌కు గురై మృతిచెందాడు.