09-11-2024 01:18:27 PM
నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలంలో ఘటన
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): గుడిసెలో విద్యుత్ బల్బ్ ఆన్ చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ గురై బాలుడు మృతి చెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఐతోల్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఎల్లగౌడ్, సుజాత దంపతుల కుమారుడు నిశాంత్ గౌడ్ (8) మూడవ తరగతి చదువుతున్నాడు. శనివారం సెలవు దినం కావడంతో తమ గుడిసెలో విద్యుత్ బల్బ్ ఆన్ చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ గురయ్యాడు. దీంతో అక్కడికక్కడే తలడిల్లుతూ కుప్పకూలాడు. స్థానికులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు పేర్కొన్నారు.