09-11-2024 01:29:33 PM
రాజేంద్రనగర్ (విజయక్రాంతి): రాజేంద్రనగర్ శాస్త్రీపూరంలో ఫుట్ పాత్ లపై వెలసిన కట్టడాలను జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేస్తున్నారు. వ్యాపారులు రోడ్డుకు ఇరువైపులా వెలసిన వ్యాపార సముదాయాలు, ఫుట్ పాత్, రోడ్లు కబ్జా చేశారు. ఫుట్ పాత్ లు కబ్జా చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు సాయంత్రం వేళలో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ నేపథ్యంలో స్పందించిన టౌన్ ప్లానింగ్ అధికారులు శనివారం ఉదయం నుంచి 100 మంది పోలీస్ బందోబస్తుతో కూల్చివేతలు చేపట్టారు.