ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం వ్యాపారం
01-08-2026 12:00 AM
మాజీ బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ
సికింద్రాబాద్, జూలై 31 (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల పథకం పేరుతో పేద ప్రజలతో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యాపారం చేస్తోందని కంటోన్మెంట్ బోర్డు మాజీ నామినేటెడ్ సభ్యుడు జె. రామకృష్ణ ఆరోపించా రు. శుక్రవారం మహేంద్రహిల్స్లోని తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జె. రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, టీమ్స్ ఆసుపత్రి, బోనాల ఉత్సవాలకు సంబంధించిన పలు అంశాలపై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సరైన అవగాహన లేకుండా అద్భుతమైన మాటలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతోందని రామకృష్ణ విమర్శించారు. సర్వే నంబర్ 844/1 మల్కాజిగిరి పరిధిలో ఉండగా, అక్కడ కంటోన్మెంట్లో 400 ఇళ్ల నిర్మాణం ఎలా చేపడతారో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.






