calender_icon.png 27 October, 2025 | 10:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా కలెక్టర్ కు మత్స్యగిరి గుట్ట బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందజేత

27-10-2025 08:17:40 PM

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలో గల శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల పత్రికను సోమవారం జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు చైర్మన్ కొమ్మారెడ్డి నరేష్ రెడ్డి, ఈవో సల్వాద్రి మోహన్ బాబు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ హనుమంతరావుకు పేద పండితులు ఆశీర్వచనం అందించి, శాలువాతో సన్మానించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యగిరి గుట్ట డైరెక్టర్లు పూజారులు తదితరులు పాల్గొన్నారు.