calender_icon.png 27 October, 2025 | 10:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండ్ల మధ్యలో పోస్ట్ ఆఫీస్ వద్దని కమిషనర్ కు వినతి

27-10-2025 08:15:03 PM

చిట్యాల (విజయక్రాంతి): మా ఇండ్ల మధ్యలో పోస్ట్ ఆఫీస్ వద్దని, తొలగించి మరెక్కడైనా ఏర్పాటు చేయవలసిందిగా కాలనీ మహిళలు మున్సిపల్ కమిషనర్ దండు శ్రీనివాస్ కి సోమవారం వినతిపత్రం అందజేశారు. చిట్యాల మున్సిపాలిటీలోని పదో వార్డులో ఇండ్ల మధ్యలో పోస్ట్ ఆఫీసు ఏర్పాటు చేయడం వల్ల ప్రతినెల దాదాపు 1200 మంది వృద్దులు, దివ్యాంగులు మొదలగు ఆసరా పింఛనుదారులందరూ వస్తున్నారని, అక్కడ మరుగుదొడ్లు లేకపోవడం వల్ల ఇండ్ల ముందే మూత్ర విసర్జన, మలవిసర్జనతో పాటుగా అనేకమంది దగ్గుతూ తెమడవేస్తూ, పాండ్లు, బీడీలు, సిగరెట్లు తంబాకులు తిని ఇండ్ల ముందు గోడల మీద ఉమ్మి వేస్తున్నారని, ఈ రకంగా చేయడం వల్ల మా ఇండ్లలో ఉన్న చిన్న పిల్లలు, పెద్దలు అనారోగ్యానికి గురవుతూ అనేక వ్యాధుల బారినపడి ఆస్పత్రులు పాలై ఆర్థికంగా, ఆరోగ్యపరంగా తీవ్రంగా నష్టపోతున్నాం అని పేర్కొన్నారు.

మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసి, వెంటనే మా  ఇండ్ల మధ్యలో మా కాలనీలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ను తొలగించి భువనగిరి రోడ్డు వెంట గతంలో ఉన్న పాత పోస్ట్ ఆఫీస్ ఏరియాలోనైనా లేదా ఇంకేక్కడ నైనా పోస్ట్ ఆఫీస్ ను ఏర్పాటు చేసేటట్లుగా చర్యలు తీసుకొని మాకు న్యాయం చేకూర్చగలరని తెలిపారు. అదేవిధంగా మా ఇండ్ల మధ్యలో పిచ్చి మొక్కలు, కంప చెట్లు పెరిగి పందులు, దోమలు విపరీతంగా పెరిగిపోయి అనారోగ్యాలకు  గురి అవుతున్నాం. తక్షణమే దోమల, పందుల నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జమాండ్ల కవిత, మందడి కృష్ణవేణి, మందడి హేమలత, గంటల రజిత, కుకడుపు లక్ష్మి, సిలివేరు లక్ష్మి, మమత, నాగలక్ష్మి, రమ్య, సుజాత, బొక్క మంజుల, తదితరులు పాల్గొన్నారు.