06-08-2025 09:51:17 PM
కిష్టాపురం గ్రామంలో తల్లిపాల వారోత్సవాలు..
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీటీసీ భీమనపల్లి సైదులు..
మునుగోడు (విజయక్రాంతి): తల్లిపాలలో పోషక విలువలు సమృద్ధిగా ఉంటాయని పోత పాలకంటే తల్లిపాలు తాగితే బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో రోగనిరోధక శక్తితో పెరుగుతారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీటీసీ బీవనపల్లి సైదులు అన్నారు. మునుగోడు మండలం(Munugode Mandal) కిష్టాపురం గ్రామ పరిధిలోని అంగన్వాడి కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తల్లిపాలు బిడ్డకు మొదటి టీకాగా పనిచేస్తాయి బిడ్డ పుట్టిన అరగంటలోపు తల్లిపాలు పట్టిస్తే బిడ్డకు ఒక వరంగా పనిచేస్తాయని తల్లులకు చెప్పారు.
బిడ్డకు ఆరు నెలలు నిండే వరకు తల్లిపాలు తప్ప ఏ ఇతర ఆహారం పెట్టకూడదని ఏడవ నెల నుండి తల్లిపాలు కొనసాగిస్తూ అనుబంధ పోషకాహారం అందించాలని, రెండు సంవత్సరాల వరకు తప్పనిసరిగా తల్లిపాలు కొనసాగించాలని తల్లులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్స్ మంజుల, సుజాత ఏఎన్ఎం పద్మ ,రాధ ఆశా వర్కర్ ధనలక్ష్మి ,గర్భిణీలు బాలింతలు తల్లులు ఉన్నారు.