06-08-2025 10:12:58 PM
ఘట్ కేసర్: గంజాయి విక్రయిస్తూ పట్టుబడిన యువకుడిని ఘట్ కేసర్ పోలీసులు(Ghatkesar Police) బుధవారం రిమాండ్ కు తరలించారు. ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ఘట్ కేసర్ పట్టణంలోని గాంధీనగర్ లో పోలీస్ సిబ్బందితో పెట్రోలింగ్ చేస్తుండగా ఒక వ్యక్తి బ్యాగుతో అనుమానస్పదంగా కనిపించి మమ్ముల చూసి పారిపోతుండగా అట్టి వ్యక్తిని పట్టుకొని విచారించడం జరిగిందన్నారు. తన పేరు షేక్ షాహిద్ తండ్రి కలీం చిరునామా ఘట్ కేసర్ అని తెలిపి తనకు గంజాయి పీల్చే అలవాటు ఉందని, అమ్మే అలవాటు కూడా ఉన్నదని నేరం ఒప్పుకున్నట్లు తెలిపారు. ఇట్టి గంజాని, సెల్ ఫోన్ ని స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తులో భాగంగా రిమాండ్ కు తరలించడం జరిగిందని తెలిపారు.