07-08-2025 03:12:34 PM
మూటలు మోసేందుకే సీఎం ఢిల్లీ వెళ్తున్నారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు(Harish Rao) మరోసారి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) రెండు లక్షల పింఛన్లను రద్దు చేసిందని హరీశ్ రావు ఆరోపించారు. పింఛను రూ.4 వేలు(pensions) ఇస్తామని చెప్పి.. ఇంకా పెంచలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు గురుదక్షిణగా గోదావరి జలాలను తరలిస్తున్నారని ఆరోపించారు. కన్నెపల్లి పంపులను ఆన్ చేస్తే.. అన్ని ప్రాజెక్టులు నిండుతాయని సూచించారు. మధ్యాహ్న భోజనం పథకం కార్మికులు ధర్నా చేస్తే కేసులు పెట్టారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి మూటలు మోసేందుకే ఢిల్లీ వెళ్తున్నారని హరీశ్ రావు పునర్ఘంటించారు. బీసీలకు 42శాతం కోటా పేరిట రేవంత్ రెడ్డి(Revanth Reddy) అండ్ బ్యాచ్ ఢిల్లీ వెళ్లిన చేసిన డ్రామా అట్టర్ ఫ్లాప్ అయ్యిందని ఎద్దేవా చేశారు. ఢిల్లీ వేదికగా నిర్వహించిన దొంగ దీక్షకు.. కూతవేటు దూరంలో ఉండి రాహుల్ గాంధీ రాలేదన్నారు. మీ ధర్నాలో నిజాయితీ లేదని, బీసీలకు 42శాతం కోటా అమలు చేస్తారనే మాటలపై నమ్మకం రాహుల్ గాంధీ, ఖర్గే లతో పాటు, తెలంగాణ ప్రజలకు కూడా లేదని సుస్పష్టం అయ్యిందని హరీశ్ రావు నిన్న ఎక్స్ లో పేర్కొన్నారు.