6 August, 2026 | 2:30 AM

కృష్ణాజివాడిలో తల్లిపాల వారోత్సవాలు

06-08-2026 12:00 AM

తాడ్వాయి, ఆగష్టు, 5( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో బుధవారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. జాతీయ తల్లిపాల వారోత్సవాలు సందర్భంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉపాధ్యాయురాలు పద్మ మాట్లాడుతూ.. పుట్టిన శిశువుకు తల్లిపాలు అత్యుత్తమ ఆహారమని తెలిపారు.ప్రతి తల్లి తమ శిశువుకు తల్లిపాలు అందించాలని కోరారు. తల్లిపాలలో అన్ని రకాల పోషకాలు, రోగనిరోధక శక్తి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయకులు రూప  పాల్గొన్నారు.