నశాముక్త్ భారత్ అభియాన్ ర్యాలీ
సికింద్రాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): బ్రహ్మకుమారీస్ బోయిన్ పల్లి చీఫ్ ఉమ ఆధ్వర్యంలో నిర్వహించిన నశా ముక్త్ భారత్ అభియాన్ అవగాహన ర్యాలీలో బ్రహ్మకుమారీస్ తో కలిసి మాజీ కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన అనంతరం, మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు.
అనంతరం కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగాఉండి,ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు ఇస్తూ‘నశా రహిత భారత్ వికసిత భారత్‘ లక్ష్య సాధనకు ప్రతి పౌరుడు బాధ్యతగా ముందుకు రావాలని కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ కోరారు.ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు,మహిళలు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు.






