16-07-2025 01:23:51 AM
- పురపాలక, రెవెన్యూ, పోలీసు శాఖల్లో అవినీతి ఎక్కువ
- శిక్ష పడుతుందన్న భయం అధికారుల్లో లేదు
- సీఎంకు లేఖ రాసిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి
హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): ప్రభుత్వ కార్యాలయాలలో లంచాలు ఇవ్వందే ఏ పని జరగడం లేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా పురపాలక, రెవెన్యూ, పోలీసు వంటి శాఖలలో లంచాలు ఇవ్వనిదే ఏ పని కావడం లేదన్నారు.
ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి మంగళవారం ఆయన లేఖ రాశారు.‘అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ కేసులు రాసినా, వాటి విచారణలో జాప్యం.. అలాగే కోర్టులలో చాలా కేసులు వీగిపోవడం జరుగుతుంది. దానితో అవినీతి అధికారులకు తప్పు చేస్తే శిక్ష పడుతుందన్న భయం లేకుండాపోయింది’ అని ఆ లేఖలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆ లేఖలో ఆయన కొన్ని ఉదాహరణలు వివరించారు.
కేసు వివరాలు
- జగదీష్ బాబు కాల్వరామ్ పూర్, జిల్లా పెద్దపల్లిలో పంచాయితీరాజ్ శాఖలో ఏఈగా పనిచేస్తున్నారు. ఈయన తేదీ 12- నాడు కంట్రాక్టర్ నుంచి రూ. 90,000 (తొంభై వేలు) లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఇతను 2017లో కరీంనగర్ మండల పరిషత్‌లో ఏఈగా పనిచేస్తున్నప్పుడు రూ.1.5. లక్షలు లంచం తీసుకుం టూ ఏసీబీకి పట్టుబడ్డాడు. విచారణలో జాప్యం, ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతిలో జాప్యంతో అతను పైఅధికా రుల చలవతో మంచి పోస్టింగు తెచ్చుకొని మళ్లీ అవినీతికి పాల్పడుతున్నాడు. రాష్ర్ట సచివాలయంలో అవినీతి అధికారులకు కొమ్ముకాస్తున్నారు.
- డి. శ్రీనివాస్‌రెడ్డి డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ అధికారిగా పనిచేస్తున్నాడు. ఇతనిపై అ.ని.శా. అధికారులు తేది 6- 2018 నాడు అవినీతి కేసు నమోదు చేశారు. (ఎఫ్.ఐ.ఆర్. నం. 04/ఆర్‌సీటీ ప్రభుత్వం నుం చి సదరు అధికారిని ప్రాసిక్యూట్ చేయడానికి జాప్యం జరగడంతో గత 7 సం వత్సరాలుగా కేసు చార్జిషీటు ఫైల్ చేయలేదు. ఆయన ఈ మధ్య కోర్టులో కేసు వేయగా, ఏసీబీ కేసును పరిగణనలోనికి తీసుకోకుండా ఆయనకు సీటీఓ ప్రమోషన్ ఇవ్వవలసినదని ఉత్తర్వులు కోర్టు జారీ చేసింది. ఈవిధంగా చాలామంది అధికారులు ఏసీబీ కేసులున్నా ప్రమోషన్లు, మంచి పోస్టింగులు పొం దుతు న్నారు. ఈ విషయమై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఈ క్రింది సూచనలు చేస్తోందని లేఖలో ఆయన వివరించారు.
సూచనలు
-ఏసీబీ కేసు నమోదు చేసిన తరువాత మూడు నెలలలో విచారణ పూర్తి చేసి తమ రిపోర్టు విజిలెన్స్ కమిషన్ ద్వారా ప్రభుత్వానికి పంపాలి. విజిలెన్స్ కమిషన్ రిపోర్టులు పరిశీలించి రెండు వారా ల్లో కేసుపై తమ అభిప్రాయాన్ని తెలుపుతూ ఏసీబీ రిపోర్టునుప్రభుత్వానికి పంపాలి.
-రాష్ర్ట సచివాలయంలో సంబంధిత శాఖ వారు ఏసీబీ రిపోర్టుపై ఒక నెలలో నిర్ణ యం తీసుకోవాలి. నిందితుణ్ణి ప్రాసిక్యూట్ చేయాలని ఏసీబీ అడిగినప్పుడు తప్పకుండా ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాలి. మేము కొన్ని దస్త్రాలు పరిశీలించినప్పుడు సంబంధిత శాఖలలో నింది తులకు సహాయము చేసే పద్ధతిలో కేసు పెండింగులో ఉంచడం లేదా ప్రాసిక్యూషన్ అనుమతి ఇవ్వకపోవడం జరిగింది.
-కోర్టులో ప్రాసిక్యూషన్ తరపున గట్టిగా వాదనలు వినిపించి దోషికి శిక్షపడేటట్లుగా చూడాలి. అలాగే కేసు నమోదైన రెండు సంవత్సరాల్లో కేసుకు ముగింపు ఉండాలి.
-ప్రస్తుతం ఏసీబీ కేసులు 60 శాతానికి మించి సక్సెస్ అవడం లేదు. దీనిని 90 శాతం సక్సెస్ రేటు వరకు తీసుకు వెళ్లాల్సిన అవసరముంది.
-ఏసీబీ ఒక ఉద్యోగిపై కేసు నమోదు చేసిన తరువాత అతని కేసు పూర్తి అయ్యే వరకు పోస్టింగు ఇవ్వకూడదు.
సగటున నెలకు 20 కేసులు
రాష్ర్టంలో ఏసీబీ సగటున నెలకు 20 కేసులు నమోదు చేస్తున్నాది. అయితే విచారణలో ఆలస్యం, కోర్టులలో కేసులు కొట్టివేత, కేసు పెండింగులో ఉన్నా ప్రమోషన్లు ఇస్తుండం వంటి వాటితో ఏమీ అవ్వదు అన్న అభిప్రాయం ప్రజలలో కలుగుతుంది. ఏసీబీ కేసులలో తొందరగా విచారణ చేయడం, గట్టి శిక్షలు పడుటం, ఒకసారి ఏసీబీకి పట్టుబడ్డ అధికారులకు కేసు పూర్తి అయ్యే వరకు పోస్టింగులు ఇవ్వకుండా అలాగే ప్రమోషన్లు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని సీఎంను కోరుతున్నట్లు ఆయన ఓ లేఖను మంగళవారం విడుదల చేశారు.