వంతెన పనులను వేగవంతం చేయాలి
ఘట్‌కేసర్ ప్రజల డిమాండ్
ఘట్‌కేసర్, జూన్ 21 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ పట్టణంలో గత 17 సంవత్సరాల నుండి కొనసాగుతున్న రైల్వే బ్రిడ్జి పెండింగ్ పనులను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ రాజకీయాలకు అతీతంగా ఘట్కేసర్ ప్రజలు ఆదివారం మాజీ ఎంపిటిసి నందo గణేష్ బాబు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత రెండు సంవత్సరాల నుండి పట్టణ ప్రజలు పోరాటం చేసి పెండింగ్ లో ఉన్న బకాయిలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి దాదాపు రూ. 4 కోట్ల వరకు కాంట్రాక్టర్ కు ఇప్పించడం జరిగింది. అయినప్పటికీ పనులు వేగవంతం అవ్వకపోవడం తో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్, అధికారుల యొక్క నిర్లక్ష్యంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
రేపటి నుండి బ్రిడ్జి పనులు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభం చేయాలని, లేనట్లయితే రాజకీయాలకు అతీతంగా ప్రజల ఆధ్వర్యంలో వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని సమావేశంలో నిర్ణయించడం జరిగింది. గవర్నర్, సీఎం, మినిస్టర్, కాంట్రాక్టర్, ఆర్ అండ్ బి, అధికారులను కలిసి సమస్య పై వినతిపత్రం ఇవ్వటం, వినతి పత్రాలతో స్పందించక పోతే వరంగల్ హైవే దిగ్భందించడం, అధికార కార్యక్రమాలను బైకాట్ చేయడం, ఎన్నికలు ఏరోజు జరిగినా కూడా ప్రజలు పూర్తిగా ఎలక్షన్ ను బైకాట్ చేయడం, ప్రతి రోజు సోషల్ మీడియా వేదికగా అధికారుల వైఫల్యాలను ప్రశ్నించడం జరుగుతుందన్నారు.
ఈకార్యక్రమంలో బర్ల ఆంజనేయులు, అంకం సురేష్, బండ్లగూడెం కిషోర్, ఖలీల్, వీరేష్, యువకులు దీపక్, సలీం, ఉదయ్, శివ, విద్యార్థి సంఘం నాయకులు ఏబీవీపీ శ్యామ్ కిరణ్, జేఏసీ నాయకులు మారం లక్ష్మారెడ్డి, బచ్చు నాగేష్ నాగేష్, ప్రమోద్, రేసు లక్ష్మారెడ్డి, బిఆర్‌ఎస్ నాయకులు బండారు శ్రీనివాస్ గౌడ్, నర్సింగ్ రావు, రాఘవరెడ్డి, బిజెపి నాయకులు మహిపాల్ రెడ్డి, సోమసాని రమేష్, గుండ్ల రామతీర్థ కాంగ్రెస్ నాయకులు కడుపోల్ల మల్లేష్, బర్ల దేవేందర్, కుతాడి రవి, కుల సంఘాల పెద్దలు మదనగిరి సురేష్, మహిపాల్ రెడ్డి, బర్ల కిష్టయ్య, పసుపునూరి శేఖర్, శరత్, ప్రజలు పాల్గొన్నారు.






