22 June, 2026 | 2:59 AM

యోగాతో శారీరక, మానసిక దృఢత్వం

22-06-2026 12:25 AM

కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, జూన్ 21 (విజయక్రాంతి): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వనపర్తి జిల్లా మర్రికుంటలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల మైదానంలో యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ యోగా సాధన చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు. యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. యోగ శిక్షకురాలు సుగుణ ఆధ్వర్యంలో విద్యార్థులు, అధికారులు యోగా సాధన చేశారు. అనంతరం నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. పలువురు జిల్లా అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.