calender_icon.png 1 May, 2025 | 8:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెన్త్ ఫలితాల్లో బ్రిలియంట్ విద్యార్థుల విజయం

01-05-2025 01:30:42 AM

మలక్‌పేట్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): పదవ తరగతి ఫలితాల్లో బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ విద్యార్థుల అవ్వ కొనసాగింది. టెన్త్ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలను సాధించి అగ్రకామిక నిలిచారు. బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ విద్యార్థిని 587 అత్యధిక మార్కులు సాధించారు. 

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రిలియంట్ విద్యాసంస్థల నుండి 100% ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా బ్రిలియంట్ గ్రూపు అధినేత & కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులతో కలిసి బాణా సంచాలను కాల్చి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపి పుష్ప గుచ్ఛా లతో సత్కరించారు. 

ఈ సందర్బంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న  బ్రిలియంట్ విద్యా సంస్థలలో 1607 మంది విద్యార్థులు SSC పరీక్షలలో హజరు కాగా 100% ఉత్తీర్ణతతో 587, 582, 580  అత్యదిక మార్కులు సాగించినట్లు తెలిపారు.  680 మంది 550 కి పైగా మార్కులతో, 850 మంది 500 మార్కులకు పైగా, 77 మంది 500 మార్కుల లోపు సాధించినట్లు వివరించారు.