22 June, 2026 | 3:03 AM

పేదోడి కంటికి వెలుగు.. మానవీయత చాటుకున్న దుద్దిళ్ల శ్రీనుబాబు

22-06-2026 12:00 AM
  1. మంత్రి శ్రీధర్ బాబు ఆశీస్సులతో నిరంతర సేవా ప్రస్థానం
  2. ముత్తారంలో కంటి అద్దాల పంపిణీలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు

ముత్తారం, జూన్ 21(విజయ క్రాంతి)రాజకీయాలకు అతీతంగా, పేద ప్రజల కష్టాలను గుర్తించి వారికి అండగా నిలవడంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు తనదైన ముద్ర వేస్తున్నారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆశీర్వాదాలతో హైదరాబాద్ కు చెందిన పుష్పగిరి కంటి ఆసుపత్రి సహకారంతో ముత్తారంలో ఆయన చేపట్టిన కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆదివారం ముత్తారం మండల కేంద్రాల్లోని ప్రభుత్వాసుపత్రిలో కంటి పరీక్షలు నిర్వహించిన వారికి కంటి అద్దాల పంపిణీలు ముఖ్యఅతిథిగా శ్రీనుబాబలో పాల్గొని అద్దాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీను బాబు మాట్లాడుతూ, పేదలకు కంటి చూపును అందించడం అంటే వారి జీవితంలో వెలుగును నింపడమేనని, దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రజా సేవకు అంకితం చేస్తున్నానని తెలిపారు. నిరుపేదల ఆరోగ్యమే మా ప్రభుత్వ ధ్యేయం, మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో ప్రతి పేద కుటుంబానికి అండగా ఉంటామని ఉద్వేగంగా తెలిపారు.

సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న శ్రీను బాబు

సామాజిక బాధ్యతతో శ్రీను బాబు చేస్తున్న ఇటువంటి సేవా కార్యక్రమాలు పలువురి ప్రశంసలు అందుకుంటున్నాయి. ఏ ఆపద వచ్చినా ప్రజల వెంటే ఉంటూ, ఆరోగ్య పరమైన ఇబ్బందులు తొలగించేందుకు ఆయన చేస్తున్న కృషి అభినందనీయం. కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి సకాలంలో పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి అద్దాలు అందించి వారి జీవితాల్లో ఆశాకిరణంగా మారారు.ఈ కార్యక్రమంలో పుష్పగిరి వైద్యులు, సిబ్బంది,

ప్రోగ్రాం పర్యవేక్షకుడు మహేందర్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, పీఏసీఎస్ చైర్మన్ అల్లాడి యాదగిరిరావు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు బియ్యని శివ, సర్పంచులు గడ్డం రాజేష్, ఏఎంసీ డైరెక్టర్ బుచ్చంరావు, మాజీ సర్పంచ్ తూటి రజీతరఫీ, యూత్ మండల అధ్యక్షుడు బక్కతట్ల వినీత్ యాదవ్, నాయకులు తాటిపాముల శంకర్, కోల విజయ్ గౌడ్, సంపత్ రావు, అశోక్ చారి,  స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.