22 June, 2026 | 3:02 AM

ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదు

22-06-2026 12:00 AM

యోగాతో ఆరోగ్యం.. ఆరోగ్యంతో అందమైన జీవితం

దైనందిన జీవితంలో యోగా ఒక భాగం కావాలి

పంచాయతీరాజ్ శాఖ మంత్రి అనసూయ సీతక్క

ములుగు (మహబూబాబాద్), జూన్ 21 (విజయక్రాంతి): ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదని, యోగతో సంపూర్ణ ఆరోగ్యంతో అందమైన జీవితం సాధ్యపడుతుందని, ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో యోగాను ఒక భాగంగా అలవర్చుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ఆదివారం ములుగు పట్టణంలోని జెడ్పీహె చ్‌ఎస్ బాలుర పాఠశాల ప్రాంగణంలో ఆ యుష్ శాఖ ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీ య యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘ఆరోగ్యవంతమైన వృద్ధాప్యం కోసం యోగ’ అనే అంశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, యోగ అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదు..శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం.

ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలన్నారు.భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప సంపద ‘యోగ’ అని పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, సాంకేతిక సౌకర్యాల పెరుగుదల కారణంగా మనిషి శారీరక శ్రమకు దూరమవుతూ అనేక రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారన్నా రు. ప్రతి మనిషికి ఉన్న అత్యంత విలువైన ఆస్తి ఆరోగ్యం అని, ఆరోగ్యం బాగోలేకపోతే జీవితంలో ఎంత సాధించినా దానిని పూ ర్తిగా ఆస్వాదించలేమని పేర్కొన్నారు.

ఆరోగ్యంగా ఉండటమే ప్రతి వ్యక్తి జీవితానికి బలమైన పునాది అని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ కనీసం కొంత సమయాన్ని నడక, యోగ, ఇతర శారీరక వ్యాయామాలకు కేటాయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్వో వికాస్ మీనా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, డీఈఓ సిద్ధార్థ్ రెడ్డి, నోడల్ అధికారి డాక్టర్ సంధ్య, డీఎస్పీ రవీందర్, ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు, మండల అధికారులు, వైద్య సిబ్బంది, విద్యార్థులు, యువత, మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యోగా సాధకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మహబూబాబాద్ ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో..

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల్లో మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరిష్, మున్సిపల్ చైర్పర్సన్ గుగులోత్ జ్యోతి, డీసీసీ అధ్యక్షురాలు భూక్యా ఉమ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవి రాథోడ్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి దేశీ రామ్ నాయక్, జిల్లా క్రీడల అధికారిని జ్యోతి, డిపిఆర్‌ఓ రాజేంద్రప్రసాద్, నోడల్ అధికారి డాక్టర్ పి. కిరణ్ కుమార్, రవికుమార్, కన్వీనర్ శ్రవణ్ కుమార్, స్థానిక తహసిల్దార్ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ వినోద్ కుమార్, వైద్యులు వసుంధర దేవి, సూర్యం ,పూజిత, యోగశిక్షకులు స్పందన, కమల్ సుందర్, రామకృష్ణ, వడ్డెబోయిన శ్రీనివాస్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.